అధిక బరువు ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేక పోవడం వల్ల, సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంది.ఏది ఏమైనప్పటికీ అధిక బరువు పెద్ద సమస్యగా మారింది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి కొన్ని టిప్స్ పాటించడం వల్ల బరువు తగ్గుతారు. ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...   

 రోజూ చేసే భోజనానికి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం మంచిది. భోజనానికి బదులు కూరగాయలు,  ఆకుకూరలు,సలాడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్స్, పోషకాలు అధికంగా లభిస్తాయి. దీనివల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.

 భోజనం చేసేటప్పుడు హడావుడిగా చేయకూడదు.ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎంత తింటున్నామో తెలియకుండా తింటుంటాం.కాబట్టి సరైన సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా బాగా నమిలి మింగాలి.తినేటప్పుడు ఆహార వైపే దృష్టి పెట్టాలి. అప్పుడే తిన్నది సరిగా జీర్ణం అవుతుంది.

 భోజనం చేసేటప్పుడు పెద్ద ప్లేటులో తినకుండా, చిన్న ప్లేట్ లో తినడం మంచిది. రోజుకి 250 క్యాలరీలు తగ్గించి తినడానికి అవకాశం ఉంటుంది.

ఉదయం నిద్ర లేవగానే ఒక గంటలోపు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటేటిఫిన్ చేయడం వల్ల మధ్యాహ్నం భోజనానికి సమయం తగ్గుతుంది. దీనివల్ల కొవ్వు పెరుగుతుంది.

 మనం రోజూ తీసుకునే ఆహారంలో పాలు,ఉత్పత్తులతో తయారుచేసిన పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే క్యాల్షియం కొవ్వును కరిగిస్తుంది.

వ్యాయామం చేసిన తర్వాత చాలా మంది లేటుగా భోజనం చేస్తుంటారు. అలా చేయకుండా వ్యాయామం చేసిన గంటల లోపు భోజనం చేయడం మంచిది.ఎందుకంటే శరీరంలో కొత్తగా చేరే క్యాలరీలు తొందరగా తగ్గుతాయి.

 ప్రతిరోజు భోజనం చేయడానికి ముందు నారాంజి వంటి నిమ్మజాతి పండును సగం తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: