బేకింగ్ సోడా అందరి వంట గదుల్లోని ఉంటుంది. బేకింగ్ సోడా ను కొన్ని వంటలలో వాడుతారు అని తెలుసు. కానీ బేకింగ్ సోడా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా ను " సోడియం కార్బోనేట్ " అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే రసాయన లక్షణాలు చర్మ వ్యాధులును రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయి. చర్మ సంరక్షణకు బేకింగ్ సోడా ఏ విధంగా ఉపయోగపడుతుందో, దాని వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

 బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మం మీ సొంతం.

 ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకొని నీటితో కలిపి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. కొద్ది సేపు అయిన తర్వాత కానీ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలతో పూడి పూడిపోయిన చర్మరంధ్రాలు క్లీన్ అవుతాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా ను, వధువు గాన అవుతుంది.

 స్నానం చేసే తోటలోకి గాని, నీటి లోకి గాని బేకింగ్ సోడా వేసి ఆ నీటిలో అర్ధగంట సేపు స్నానం చేయడం వల్ల శరీరంలోని చనిపోయిన కణాలు తొలగిపోయి కొత్త కణాలు వస్తాయి. అవి శరీర దుర్వాసనను పోగొట్టి శరీరాన్ని తాజాగా ఉంచుతాయి.

 వేసవికాలంలో వేడివల్ల కందిపోయిన చర్మానికి ఒక కప్పు బేకింగ్ సోడాను నీటితో కలిపి చర్మానికి రాయడం వల్ల కందిపోయిన చర్మం మృదువుగా అవడమే కాకుండా, శరీరం చల్లబడుతుంది.

 ముఖం పై మొటిమలు తో బాధపడుతున్న వాళ్లు కొంచెం బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి ముఖానికి  అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గుతాయి అంతేకాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: