చాలామంది అందంగా కనబడటం కోసం వారి ముఖ సౌందర్యానికి ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు. కానీ  అరచేతుల విషయంలో మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. అందువల్ల వారి అరిచేతులు ఎంతో కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా మరికొందరు ఎల్లప్పుడు పనులను చేస్తున్న వారిలోనూ, అధిక గాఢత కలిగిన డిటర్జెంట్ సబ్బులను వాడే వారిలో కూడా ఈ విధంగా అరిచేతులు ఎంతో కఠినంగా ఉంటాయి. అయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎంతో కఠినంగా ఉన్న అరచేతులు మృదువుగా, సున్నితంగా తయారవుతాయి. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం....                       

మృదువైన అరచేతుల కోసం ఒక టీస్పూన్ పంచదారలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఓ మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ఐదు నిమిషాల పాటు అరచేతులను బాగా మర్దన చేయడం వల్ల కఠినంగా ఉన్న అరచేతులు ఎంతో మృదువుగా తయారవుతాయి.అయితే ఈ చిట్కాను కనీసం వారం రోజులపాటు క్రమం తప్పకుండా పాటించాలి. కొంతమందికి కేవలం శీతాకాలంలో మాత్రమే కాకుండా ఇతర కాలాలలో కూడా చేతులు పొడిబారడం జరుగుతుంది. అలాంటి వారు క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ వాడటం వల్ల చేతులు మృదువుగా తయారవుతాయి.

ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ టీ స్పూన్ల తేనె, కోడిగుడ్డులోని తెల్ల సొన, ఒక టేబుల్ స్పూను గ్లిజరిన్, ఒక టీ స్పూన్ బార్లీ పొడి వేసి బాగా మిశ్రమంలా కలపాలి.ఈ మిశ్రమాన్ని అర చేతులకు రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారానికి కనీసం రెండు సార్లు తప్పకుండా చేయాలి. అదేవిధంగా మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా తరుచూ నీటిని తాగుతూ,తాజా పండ్లు కూరగాయలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా ఉంటూ, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: