యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటో చూద్దాం..?
మూత్ర మార్గం తో సహా మూత్ర వ్యవస్థలోని చాలా భాగాలు దెబ్బ తినడాన్ని యూరిన్ ఇన్ఫెక్షన్ గా పేర్కొంటారు వైద్యులు. యూరిన్ సిస్టం లో ఏర్పడే ఇన్ఫెక్షన్ ను మనం యూరిన్ ఇన్ఫెక్షన్ గా పరిగణిస్తాము. క్రమరహిత దినచర్య తో పాటు, తీసుకునే నీటిని నిర్లక్ష్యం చేయడం అతి పెద్ద కారణం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కి సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీయవచ్చు అని వారు హెచ్చరిస్తున్నారు. అయితే మనలో చాలా మంది దీని గురించి మాట్లాడటానికి వెనకంజ వేస్తున్నారు.. కారణం భయం.. ఎవరు ఏమనుకుంటారో అని..



సాధారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కు మొదటి కారణం.. తరచుగా బాత్రూంకి వెళ్తూ ఉండడం. యూరిన్ తరచూ మాటిమాటికి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే సాధారణంగా ప్రజలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించరు. కానీ అజాగ్రత్త కారణంగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

మూత్రం వెళ్ళేటప్పుడు మంట రావడం. మూత్రం మార్గంలో స్వల్ప గాయాలు అవ్వడం, మూత్రవిసర్జన సమయంలో మంట రావడం, మూత్రం పోయడానికి కూడా ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.


మూత్ర వ్యవస్థ చాలాసార్లు  దెబ్బతినడంవల్ల, పొత్తికడుపులో నిరంతరం నొప్పి వస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తులు వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.


మూత్రంలో రక్తస్రావం కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమందికి మూత్రంలో రక్తం రావడం జరుగుతుంది. అయితే మూత్రమార్గంలో గాయాలు పెద్దవి అయినప్పుడు ఇలా జరుగుతుంది. మూత్ర వ్యవస్థ యొక్క అధిక నష్టం కూడా రక్తస్రావం కావడానికి ఒక కారణం..


అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ ను ఇలా అరికట్టవచ్చు. రోజూ ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి. అలాగే ఆహారంలో విటమిన్ సి కలిగిన పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతూ.. మూత్రం పసుపు రంగులోకి మారుతుంది దీన్నిబట్టి మూత్ర సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా మనం తినే ఆహారంలో అల్లం,పెరుగు,  పచ్చి వెల్లుల్లి వంటివి చేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: