శరీరంలోని జీవ  క్రియలు సక్రమంగా జరిగినప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే లైంగిక వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. సొరకాయలో జీవక్రియను క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పురుషుల పాలిట వరం లాంటిది. దీనివల్ల వీర్య వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా లైంగిక శక్తి పెరగడంతోపాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం...

 సొరకాయ గింజలను బాగా వేయించి కొంచెం ఉప్పు, కొద్దిగా  ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి పొడిని కలిపి బాగా నూరాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపి తీసుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. ఇంకా శరీర దారుఢ్యం పెరుగుతుంది. అంతేకాకుండా వీర్య వృద్ధి చెందడానికి సొరకాయ గింజలు బాగా దోహదపడతాయి.

 గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి సొరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. కొంత మందికి సొరకాయ తినడం వల్ల జలుబు చేస్తుంది.  అలాంటి వారు సొరకాయలో మిరియాల పొడి లేదా సొంటి పొడి గానే తీసుకోవడం వల్ల మంచి  ఫలితాలు ఉంటాయి.

 కొంతమంది శరీరం చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి వారు సొరకాయ తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా విరేచనాలు కూడా తగ్గుతాయి. పేగు  పూత వంటి  సమస్యలు ఉన్న వాళ్ళు తరచూ  సొరకాయ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

 సొరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే వేసవికాలంలో సొరకాయ తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరంలో నీటి శాతం పెరిగి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

 నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు సొరకాయను నువ్వుల నూనెతో వేపుడు  చేసుకొని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా సొరకాయ తినటం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. దీంతో మలబద్దక సమస్య కూడా తీరిపోతుంది.

 సొరకాయ గింజలను పొడి చేసుకొని తీసుకోవడం వల్ల ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పిల్లల కడుపులో నులిపురుగుల నివారణకు కూడా ఉపయోగపడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: