సాధారణంగా నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకంగా దుర్వాసన వస్తుంటుంది. సాధారణంగా నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే.. తిన్న ఆహారం ఎప్పుడైతే పళ్ల సందుల్లో ఇరుక్కుపోయి, ఆ పళ్ళను మనం సరిగ్గా తోమకోవడం వల్ల దుర్వాసనకు కారణం అయ్యే, బ్యాక్టీరియా పళ్ళ మధ్యలో చేరి దుర్వాసనకు కారణమవుతుంది. అంతేకాకుండా ఈ దుర్వాసన అనారోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది. చాలామంది ఈ దుర్వాసనను దూరం చేసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలను పాటిస్తూనే, వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో , ఎటువంటి ఖర్చు లేకుండా ఒక పొడిని తయారు చేసుకొని, వాటితో నోటి దుర్గంధాన్ని తొలగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆ పొడి ఏంటి.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఆ పొడి ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. అది ఏదో కాదు జాజికాయ పొడి. జాజి కాయలు బాగా ఎండబెట్టి, పొడి చేసుకుని, ఆ పొడితో పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన ను అరికట్టవచ్చు. సహజంగా జాజికాయ కు మంచి వాసన ఉంటుంది. ఈ జాజికాయపొడి కేవలం సువాసను మాత్రమే అందించడమే కాకుండా నోటిలో పళ్ళ మధ్యలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తుంది. తద్వారా నోటి దుర్వాసన ను అరికట్టవచ్చు.
అంతేకాకుండా జాజికాయ పొడిని సూప్ లో వేసుకొని తాగడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతే కాకుండా శరీరంలోని ద్రవాలు సమతుల్యం అవుతాయి. జాజికాయ పొడిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోయి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. లివర్,కిడ్నీలలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు బయటకు తొలగిపోతాయి. జాజికాయ లో పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్ తదితర పోషక పదార్థాలు ఉండటం వల్ల శరీర ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
అంతేకాకుండా వీటిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా ఎముకల సమస్యలు దరిచేరవు. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గిపోతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి