సరైన ఆరోగ్యం పొందాలి అంటే పోషకాలు కలిగిన డ్రైఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలని .. వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాదు నీరసించి పోయిన శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చేది ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే.. డ్రై ఫ్రూట్స్ లో ఉండే అనేక రకాల న్యూట్రిషియన్స్, ప్రోటీన్స్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని ప్రతి ఒక్కరికి తెలుసు.. మితంగా తినాల్సిన ఏదైనా సరే .. అమితంగా తినడం వల్ల జరిగే పరిణామాలు కూడా అంతేగా దారుణాలకు దారితీస్తాయని అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. డ్రై ఫ్రూట్స్ కూడా అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు కూడా వారు వివరించారు..


నిజానికి ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం.. శరీరానికి తగినంత ఫైబర్ ను అందించడం వల్ల జీర్ణాశయ సమస్యలతో పాటు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కానీ డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ శరీరానికి అంత మంచిది కాదట. డ్రై ఫ్రూట్స్ నుంచి లభించే ఫైబర్ వల్ల జీర్ణాశయానికి నష్టం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా మలబద్ధకం, ఎసిడిటీ ,కడుపులో మంట ,విరేచనాలు, కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు తలెత్తుతాయి.


డ్రై ఫ్రూట్స్ లో అధికంగా కేలరీలు ఉంటాయి. తక్కువ తిన్నప్పుడు శరీరంలో తక్కువ కేలరీలు యాడ్ అవుతాయి..కానీ ఒకేసారి ఎక్కువ కేలరీలు రోజురోజుకు తినడం వల్ల అవి సులభంగా శరీరంలోకి వెళ్లిపోయి, బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

మధుమేహాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కి వున్నాయి.. డ్రై ఫ్రూట్స్ లో ఉండే చక్కెర పదార్థాలు రక్తంలో కలిసిపోయి, గ్లూకోస్ స్థాయిలను పెంచి మధుమేహాన్ని కలిగిస్తాయి.

అంతేకాదు డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫ్రక్టోస్ దంతాలపై అతుక్కుపోయి, క్లావిటీ కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఫ్రక్టోస్ అనేది తీపి పదార్థం కాబట్టి దంతాలపై పేరుకుపోయినప్పుడు దంతక్షయం ఏర్పడుతుంది.

కాబట్టి  డ్రై ఫ్రూట్స్ వల్ల మనకు లాభాలు కలగాలి అంటే తక్కువ మొత్తంలో తీసుకోవడానికి అలవాటు పడాలి.. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఇలాంటి నష్టాలే కలుగుతాయి.మరింత సమాచారం తెలుసుకోండి: