ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అంటే ఆస్తులు ఎన్ని ఉన్నా కూడా కనీసం తృప్తిగా తిండి కూడా తినలేని వారు అనేకులు ఉన్నారు. వారికి అన్నీ ఉంటాయి, కానీ ఆరోగ్యం ఉండదు. అందుకే ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే మిగితావి అనుభవించడానికి కూడా కుదరదు. అందుకే పెద్దలు ముందు జాగర్తగా ఆ సామెత తెచ్చారు. మరి కేవలం ఆరోగ్యం ఉంటే, అది ఉంది కాబట్టి ఏదో ఒక పని  వెతుక్కుంటాడు, దొరికినది చేసుకుంటాడు మొత్తానికి తాను అనుకున్నట్టు అతడు జీవించగలుగుతాడు. అందుకే పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నవారు తమకు ఏమైనా అయితే అనే విషయం దగ్గరకు రానీయకుండా ఆహార నియమాలు పెట్టుకుని జీవిత కాలం అనారోగ్యాలు దరి చేరకుండా చూసుకుంటారు.

అయితే నేటి కాలంలో పిల్లలకు కూడా భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తూనే ఉన్నాయి. వాళ్ళు తినే ఆహారం నుండి వాళ్ల శరీరానికి కావాల్సిన లేదు అవసరమైన పోషకాలు అందకపోవటం చేత ఈ సమస్య ఎదురవుతుంది. దీనితో మళ్ళీ ఆసుపత్రుల వెంట పడి తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ఒక్కసారి అలా మూలన పడితే మళ్ళీ ఎన్ని ఔషదాలు శరీరంలోకి వెళ్లి ఎంతవరకు నాశనం చేస్తాయో కూడా తెలియదు. ఆంగ్ల ఔషదాలు వాడిన వారి శరీరం లో అంటే ఒక పెద్ద ఆపరేషన్ జరిగిన వారి శరీరంలో మనిషికి అవసరమయ్యే టిష్యూస్ బోలెడు పనికి రాకుండా పోతాయి. దీనికి కారణం ఆయా ఔషధాలలో ఉండే తీవ్రత. అందుకే కొన్ని కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత బాగా నీరసంగా అనిపిస్తుంది.

ఇక కాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రస్తుత జీవన విధానంలో ఇది ఒకటి అన్నంతగా కలిసిపోయింది మనిషి జీవితంలో. దీని బారిన వయోపరిమితి లేకుండా   పడుతూనే ఉన్నారు. మరి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు చుస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే. ఇంత చేసినా ప్రయోజనం ఉండవచ్చు లేకపోవచ్చు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఒక ఆసుపత్రి ప్రారంభించిన హెల్ప్ లైన్ ను ఢిల్లీ నుండి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. స్త్రీలలో బాగా కనిపిస్తున్న బ్రేస్త్ కాన్సర్ గురించి 12 బాషలలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. ఈ తరహా వ్యాధిపై అవగాహన అవసరం, అది ఆయా రోగులకు మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది అని ఆయన అన్నారు. దీని నుండి బయట పడిన వారు ముందుకు వచ్చి మాట్లాడాలని, తద్వారా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న  వారికీ భరోసాగా ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వ్యాధి ప్రతియేటా 3. 2 మిలియన్ లలో కనిపిస్తుంది, ఊపిరితిత్తుల కాన్సర్ కంటే ఇదే ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తుంది అని ఆయన అన్నారు. ఈ వ్యాధి వచ్చిన వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, అందుకే ఈ చికిత్స వ్యయాన్ని తగ్గిస్తే బాగుంటుందని ఆయన  సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: