మనిషి జీవితం కరోనా వైరస్ కు ముందు కరోనా వైరస్ తర్వాత అన్నట్లుగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు భారీగా డబ్బు సంపాదించాలి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ భావించేవారు. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రాణాలు పోతాయ అన్నదానిపై  కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే చాలు అని భావిస్తున్నారు. ఒకప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకోని వారు సైతం ఇక ఇప్పుడు ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకో డానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండటం గమనార్హం.



 ఈ క్రమంలోనే ప్రతీ విషయంలో కూడా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత చాలామంది వెంటనే నడవడం మొదలు పెడుతూ ఉంటారు. కాసేపటి వరకు వేగంగా నడిచి ఇక ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే భోజనం చేసిన తర్వాత నడక మంచిదేనా అనే విషయంలో మాత్రం అందుకే క్లారిటీ ఉండదు. ఎవరో ఏదో చెప్పారని ఇలా భోజనం చేసిన వెంటనే నడవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మరి నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భోజనం చేయగానే నడవడం మంచిదేనా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.



 చాలామంది ఆహారం తీసుకోగానే అది అరగడానికి నడక ప్రారంభిస్తారు. అయితే భోజనం చేయగానే నడవడం మాత్రం జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే భోజనం చేసిన వెంటనే నడవడం సరి కాదు అంటూ చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ శక్తిని వాడుతుందట. ఇక అందుకే ఆ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే ఏ పనులు చేయకూడదు అని చెబుతున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది అని చెబుతున్నారు. ఒకవేళ అవసరం అనిపిస్తే కాస్త నెమ్మదిగా నడవడం ఎంతో మంచిది అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: