ఇక ఈ మధ్య కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఎదురుకుంటున్నారు. ఇక దానికి కారణం కూడా అందరికి తెలిసిందే. మన ఆహారపుటలవాట్లు ఇంకా మారిపోతున్న జీవన శైలి వల్ల ఎన్నో ఆనారోగ్యాల బారిన పడుతున్నాము. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి మనలో చాలా మంది కూడా ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.ఇక ఇప్పుడు Brussel Sprouts అనేవి మార్కెట్ లో బాగా విరివిగానే లభ్యం అవుతున్నాయి. వీటిని అసలు ఎక్కువగా వేడి చేయకుండా హాఫ్ బాయిల్ మాత్రమే చేయాలి.ఎక్కువగా వేడి చేస్తే ఇందులో వుండే పోషకాలు తగ్గిపోతాయి.ఇక వీటిలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండుట వలన మన శరీరం ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా కాపాడుతుంది. Brussel Sprouts అనేవి డయాబెటిస్ ఉన్నవారి ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి ఇంకా అలాగే భవిష్యత్ లో డయాబెటిస్ రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.



శరీరం కణజాలం దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నరాల బలహీనత ఇంకా అలాగే నరాల మంటలను తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది అలాగే జీర్ణ సమస్యలు అనేవి అసలు లేకుండా చేస్తుంది.శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను కూడా బాగా బలోపేతం చేస్తుంది. కెరోటినాయిడ్స్‌ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు అనేవి అసలు ఏమి లేకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: