సుదీర్ఘ నిద్ర తర్వాత మీరు మేల్కొని.. ఏ పని చేయలేక పోతున్నారా లేదా ఏదైనా చిన్న పని చేసినా సరే త్వరగా అలసి పోతున్నారా .. ఇదే నిజమైతే మీ శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉందని గుర్తించాలి. ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం వల్ల కూడా ఇలా నీరసంగా అనిపించవచ్చు . ముఖ్యంగా మిమ్మల్ని అలసటకు గురి చేయడం , ఆకలిగా అనిపించకపోవడం, మనసులో మైకం కలగడం, స్థిరమైన స్థితిలోకి నెట్టివేయడం ఇలాంటి సమస్యలు తరచూ కనిపిస్తూ ఉంటే కచ్చితంగా ఈ విటమిన్ బి 12 లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అని గుర్తించాలి.

విటమిన్ బి12 లోపం అనేది జీవక్రియ రేటును తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. అలాంటప్పుడు మీ శరీరం సరైన పనితీరుకు అవసరమైన పోషకం లభించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ విటమిన్ బి 12 సహజంగా ఎక్కడ లభిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పెరుగు లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. ఎందుకంటే ఇది మెటీరియల్ బాగా గ్రహించడంలో సమయం పడుతుంది . కాబట్టి పెరుగు తీసుకోవడం వల్ల విటమిన్ బీ 12 స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.


సాల్మన్ చేపలు:
ఇందులో సహజంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్రోటీన్లు కూడా అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా సాల్మన్ చేపలలో విటమిన్ బీ ట్వెల్వ్ అని మూలకం కూడా ముఖ్యంగా మెదడు, ఎముకలు, గుండె బలంగా మారడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కోడిగుడ్లలో కూడా ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఉంటుంది అంతే కాదు అమినో యాసిడ్స్ పాటు  విటమిన్B12 కూడా పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. అలాగే పాలు , తృణధాన్యాలు వంటి వాటిలో కూడా విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: