మనకు ఈజీగా దొరికే పదార్థాలతో డికాషన్ తయారు చేసుకుని తాగడం వల్ల షుగర్ ని ఈజీగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ డికాషన్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? ఇంకా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇందుకోసం మనం మెంతులను, జామ ఆకులను, కాకరకాయ పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లను తీసుకోవాని ఆ తరువాత ఇందులో 3 లేదా 4 జామ ఆకులను, అర టీ స్పూన్ కాకరకాయ పొడిని ఇంకా 2 టీ స్పూన్ మెంతులను వేసి నీటిని మరిగించాలి. ఈ నీటిని సగం అయ్యే దాకా బాగా మరిగించిన తరువాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డికాషన్ లో 2 టీ స్పూన్ల తేనెను ఇంకా అవసరమైతే కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగాలి. షుగర్ సమస్యతో బాధపడే వారు టీ, కాపీలకు బదులుగా ఇలా డికాషన్ ను తయారు చేసుకుని తాగడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది.


షుగర్ సమస్య ఉన్న వారు ఇంకా షుగర్ సమస్య భవిష్యత్తుల్లో రాకూడదు అనుకునే వారు అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఇంకా పిసిఒడి సమస్యతో బాధపడే స్త్రీలు ఎవరైనా కూడా ఈ డికాషన్ ను తీసుకోవచ్చు. ఇక ఈ డికాషన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇంకా అలాగే మనం తీసుకున్న ఆహారంలో ఉండే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా కలవకుండా ఉంటుంది. ఇంకా అలాగే ఈ డికాషన్ ను తీసుకోవడం వల్ల కణాల చుట్టూ ఉండే రిసెప్టార్స్  సునితత్వం పెరుగుతుంది. దీని వల్ల గ్లూకోజ్ కణం లోపలికి చాలా సులభంగా వెళ్లగలుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ విధంగా మనకు సులభంగా లభించే పదార్థాలతో డికాషన్ ను తయారు చేసి తాగాడం వల్ల ఇన్సులిన్ నిరోధకత సమస్య ఈజీగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: