చలికాలంలో తల్లులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో మరి కాస్త జాగ్రత్తగా వహించడం చాల మంచిది. వింటర్‌లో వచ్చే జలుబు, గొంతు సమస్యలు, ఫ్లూ, అలర్జీ వంటి వాటి నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే.. వారు తినే ఆహారంలో కొన్నింటిని దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దామా.

ఇక చలికి పిల్లలు ఆహారం తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్లే కాదు మనం కూడా చలికి ఏం తినాలన్నా పెద్డగా ఆసక్తి చూపించారు. అందుకని వేడిగా ఏమైనా తింటే బాగుంటుందని పిల్లల కోసం స్పెషల్ ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఫెడ్ పెడుతుంటారు. అయితే నూనె, కొవ్వుతో కూడిన డీప్ ఫ్రే చేసిన ఆహారం తినడం వల్ల వారి లాలాజలం మందంగా తయారై.. తేమ పెరుగుతుంది. ఫలితంగా జలుబు, గొంతు సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు చలికాలంలో తీపి పదార్థాలు పిల్లలకు బాగా హాని చేస్తాయి. తీపి ఎక్కువ తినడం వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి.. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... చలికాలంలో పిల్లలకు కేక్స్, క్యాండీస్, కూల్ డ్రింక్స్, సోడా, చాకొలెట్ లాంటి వాటిని దూరంగా ఉంచకపోతే ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు.

హిస్టామైన్ అనే కెమికల్ కంపౌండ్ పిల్లల్లో ఎలర్జీలకు కారణమవుతుంది. ఇది కలిగి ఉన్న ఆహారం తినడం వల్ల తేమ(నంజు) పెరిగి.. గొంతు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆహారం నిమిలి మింగడానికి కూడా ఇబ్బంది పడే స్థితికి హిస్టామైన్ తీసుకొస్తుంది. కాబట్టి..  టమాట, అవకాడో, ఎగ్ ప్లాంట్, పుట్టగొడుగులు, వెనిగర్, బటర్ మిల్క్, పచ్చళ్లను చలికాలంలో పిల్లలు తినకుండా ఉండేలా చూసుకొండి. పాలు ఆరోగ్యానికి మంచి చేసేవే అయినప్పటికీ.. చలికాలంలో పిల్లలు పాల పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. వెన్న, మజ్జిగ, క్రీంలు లాంటివి నంజును తయారు చేసేవి. అంతేకాదు ఇవి పిల్లల్లో రక్త ప్రసరణ క్షీణించేలా చేస్తాయి. కాబట్టి  వింటర్ సీజన్ అయేంత వరకు పిల్లలకు వీటిని పెట్టకుండా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: