క్యూట్‌గా ఉండి.. చబ్బి ఛీక్స్‌తో ఎంతో ముద్దుగా ఉంటే చిన్న పిల్లలను చూసి ముద్దు పెట్టుకోని వారుండరనే చెప్పుకోవచ్చు. వాళ్ల స్మైల్.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే వాళ్లను చూస్తేనే సగం ప్రేమలో పడిపోతాం. ఎంత క్యూట్‌గా ఉన్నాడు బుడ్డొడు అంటూ.. ఆగలేక ముద్దులు కూడా పెట్టేసే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా చిన్న పిల్లలు ఎంతో ముద్దుగా అనిపిస్తారు. అయితే ముద్దుగా అనిపించడానికి.. వారికి ముద్దు పెట్టడానికి ఎంతో తేడా ఉంది. ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడంటే చాలు.. ఇటు బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు ఎత్తుకుని బుగ్గలపై, పెదాలపై ముద్దులు పెట్టేస్తుంటారు.

అయితే చిన్న పిల్లలకు తెలియని వయసు కాబట్టి ముద్దులు పెట్టినప్పుడు వద్దని చెప్పలేరు. తల్లిదండ్రులు కూడా కాదనలేరు. పిల్లలకు ముద్దులు పెట్టే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పెదాలపై ముద్దు పెట్టడం మానేయాలి. బంధువులు ఎత్తుకున్న పెదాలపై ముద్దులు పెట్టొద్దని ఖరాఖండిగా చెప్పేయాలి. పెదాలపై ముద్దులు పెట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో పెదవులు, నోటి విషయంలో కొన్ని బౌండరీస్ పాటించాలంటున్నారు సైకాలజిస్ట్ ఛార్లెస్ రెజ్నిక్. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమతో పెదవులపై ముద్దు పెడుతుంటారు. ఇది సరైనది కాదని.. దీనివలనే ఇతరులు తమ పెదవులపై ముద్దు పెట్టినప్పుడు పిల్లలు రెఫ్యూజ్ చేయరు. అమ్మానాన్న పెడతారు కదా, కాబట్టి అది సరైనదేనేమో అనేది పిల్లలు భావిస్తారంట.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అందరూ మంచి ఉద్దేశంతోనే ముద్దు పెడతారని చెప్పలేమని ఆయన అంటున్నారు. ఎవరైనా పెదవులపై ముద్దు పెట్టబోతే వద్దని చెప్పడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని రెజ్నిక్ తెలిపారు. మనుషుల ఉద్దేశాలు ఏవైనప్పటికి రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న ఈ కాలంలో పిల్లలను ముద్దులకు దూరంగా ఉంచడమే మంచిది. పిల్లల పెదవులపై, నోటిపై పుండ్లు ఏర్పడడానికి, రకరకాల ఇన్పెక్షన్లు, అలెర్జీలు రావడానికి ఈ ముద్దులే ప్రధాన కారణమని వైద్యుల ఆరోపణ. కాబట్టి పిల్లల ఆరోగ్యరీత్యా, మానసికంగా వారిని బలపర్చడానికి ఉపయోగపడే ఈ సూచనని తప్పక పాటించాలని ఆయన కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: