చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే అనారోగ్య సమస్యల్లో ఖచ్చితంగా మల బద్ధకం సమస్య కూడా ఒకటి.సాధారణంగా మన పిల్లలు ఏవి పడితే అవి తినేస్తూ ఉంటారు. దీంతో తిన్న ఆహారం వారికి సరిగ్గా జీర్ణం కాక కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం, గ్యాస్ ఇంకా ఆకలి మందగించడం వంటి ఇతర సమస్యలు  ఎక్కువగా తలెత్తుతాయి. అయితే చాలా మంది ఈ సమస్య నుంచి బయట పడటానికి మందులు, సిరప్‌లు పిల్లలకు వాడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే ఉండే పదార్థాలతో పిల్లల్లో వచ్చే మల బద్ధకం సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చు. పిల్లల్లో వచ్చే మలబద్ధకం సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఖచ్చితంగా పిల్లలకు రెండు పూటలా పాలు ఇవ్వాలి. ఉదయం, రాత్రి పూట గోరు వెచ్చటి పాలు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేస్తుంది. అలాగే పిల్లల్లో మల బద్ధకం సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. ఉదయాన్నే ఓ గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లలో.. ఆవు నెయ్యి కలిపి ఇవ్వండి. ఇలా చేస్తే మల బద్ధకం సమస్య సులభంగా తగ్గుతుంది.అలాగే పిల్లలకు ప్రోబయోటిక్స్ అనేవి చాలా అవసరం.


పెరుగు తినడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది బల పడుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఆటల్లో పడి ఎక్కువగా నీరు తీసుకోరు. దీని వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకావం ఉంది. పండ్ల రసాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు ఇలాంటివి ఇస్తూ ఉండాలి. నీటిని ఎక్కువగా ఇవ్వడం వల్ల వారి ప్రేగులు కూడా శుభ్ర పడతాయి. అదే విధంగా మల విసర్జన కూడా ఫ్రీగా అవుతుంది.ఇక పిల్లల్లో జీర్ణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. వారు తిన్న ఆహారం జీర్ణం కావాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి పిల్లలకు ఇచ్చేటప్పుడు, వారు తినేటప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఇవి తినడం వల్ల తిన్న ఆహారం సాఫీగా జీర్ణం అవుతుంది. కూరగాయలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పండ్లు వంటివి త్వరగా జీర్ణం అవుతాయి. ఇవి పెట్టడం వల్ల ఆరోగ్యం కూడా. అలాగే బోలెడన్ని పోషకాలు కూడా పిల్లలకు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: