
వెరసి నేటి రోజుల్లో ప్రేమలు ఎంత కామన్ గా మారిపోయాయో ఇక బ్రేకప్ లు కూడా అంతే కామన్ గా మారిపోయాయి. ఏమాత్రం చిన్న గొడవ జరిగినా బ్రేకప్ చెప్పేయడం ఇక మరో వ్యక్తితో ప్రేమలో కొనసాగడం అనేది ఒక ట్రెండ్ గా భావిస్తూ ఉన్నారు నేటి రోజుల్లో యువత. అయితే కొంతమంది మాత్రం ఇలా బ్రేకప్ జరిగిన సమయంలో ప్రేమించిన వారిని తలచుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో బ్రేకప్ ట్రెండు రోజురోజుకు పెరిగిపోతున్న సమయంలో ఇక్కడ ఒక జంట చేసిన ఆలోచన మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఏకంగా హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ ఐడియా చేసింది ఇక్కడొక జంట. ఇలాంటి పదం ఇప్పటివరకు వినలేదే.. ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా.. నిజంగానే సరికొత్తగా ఆలోచించింది ఈ జంట. ఒక వ్యక్తి తనకు ప్రేయసి బ్రేకప్ చెప్పినందుకు 25వేల రూపాయల హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆర్యన్ అనే యువకుడు తన లవర్ తో ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరు బ్రేకప్ చెప్తే అవతలి వ్యక్తి ఇందులోని డబ్బు తీసుకోవచ్చు అని ఒప్పందంతో ప్రతి నెల 500 రూపాయలు డిపాజిట్ చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ప్రియురాలు అతనికి బ్రేకప్ చెప్పింది. దీంతో అకౌంట్లో ఉన్న 25,000 రూపాయలు ఇక తనకు వచ్చినట్లు ఆర్యన్ వెల్లడించాడు . ఈ ఐడియా ఏదో బాగుంది అని నెటిజెన్స్ అందరు కూడా కామెంట్లు చేస్తున్నారు.