హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగిన ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం మొత్తం ఫుల్‌జోష్‌తో కొన‌సాగింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కాంతార విశ్వానికి ముందు భాగం (ప్రిక్వెల్)గా వస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వేడుకలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ – “ఎన్టీఆర్ నాకు సోదరుడు, నిజమైన స్నేహితుడు. ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఒక అన్నతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఈ వేడుకకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘కాంతార చాప్టర్ 1’కి సహకారం అందించమని నేను చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ప్రోత్సహిస్తారు. ఈ సినిమా కూడా వారిని ఆకట్టుకుంటుందని నాకు నమ్మకం ఉంద‌న్నారు.


హీరోయిన్ రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై క్రేజీ కామెంట్స్ చేసింది. “ఎన్టీఆర్ ఈ వేడుకకు రావడం మా బృందానికి చాలా పెద్ద ప్రోత్సాహం. ఆయన తన సొంత సినిమా లాగా మా ప్రాజెక్ట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూసి అందరూ ఆస్వాదిస్తారని నమ్ముతున్నాం” అని తెలిపారు. ఎన్టీఆర్ హాజరుతో ఈ వేడుకలో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా కాంతార మొదటి భాగం ఇచ్చిన మాంత్రిక అనుభూతిని మరింతగా పెంచుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. రిషబ్ శెట్టి ప్యాషన్, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, ఆకట్టుకునే విజువల్స్ అన్నీ కలిపి ‘కాంతార చాప్టర్ 1’ను పాన్ ఇండియా స్థాయిలో మరో పెద్ద హిట్ అయ్యే సిగ్న‌ల్స్ ఇస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: