చక్కని రుచి సువాసనను కూడా అందించే యాలకులను మనం అనునిత్యం వాడుతూనే ఉంటాం. అయితే కేవలం ఆహార పదార్దాలలోనే కాకుండా అద్భుతమైన ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే ఔషధంగా యాలకలు ఎంతో ఉపయోగ పడతాయి. తరచూ యాలకులను తీసుకుంటే కిడ్నీ, మూత్రాశయం, కిడ్నీ స్టోన్లు, మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లకు ఔషధంగా పనిచేస్తుంది.
అంతేకాదు ఈ యాలకుల వినియోగం వల్ల బీపీని తగ్గిస్తుంది. యాలకులతో జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కడుపులో మంట, అసిడిటీ తదితర అనారోగ్యాలను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్దకం తొలగిపోతుంది. యాలకుల్లో ఉండే పలు నూనె సంబంధ పదార్థాలు జీర్ణాశయంలోని మ్యూకస్ పొరను పటిష్టం చేస్తాయి. యాలకులను నమలడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే సదరు ఆయిల్స్ ఉమ్మితో కలిసి మ్యూకస్ పొరకు రక్షణగా నిలుస్తాయి.
దీని వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. రక్తహీనతను నివారించే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు యాలకుల్లో ఉన్నాయి. అంతేకాదు ఈ యాలకుల తినడం వల్ల మన శరీరంలోని ఎర్రరక్తకణాల సంఖ్యను కూడా పెంచుతాయి. ఒక గ్లాస్ వేడి పాలలో కొంత పసుపును, యాలకుల పొడిని కలిపి రోజూ రాత్రి పూట తీసుకుంటే నీరసం తగ్గుతుంది రక్తహీనత వల్ల వచ్చే ఇతర అనారోగ్యాలు కూడా దూరమవుతాయని వద్యులు చెపుతారు.

శతాబ్దాల నుంచి అనేక రకాల దంత సమస్యలకు సాంప్రదాయ చైనా వైద్యంలో యాలకులను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇవి దంతాల్లో ఏర్పడే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లను తొలగిస్తాయి. యాలకులు, దాల్చినచెక్కల పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే గొంతులో వేసుకుని పుక్కిలిస్తే గొంతులో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలుకల ఈ యాలకులను మన దైనందిన జీవిత ఆహారపు అలవాట్లలో ఎంత ఉపయోగించుకుంటే అంత ప్రయోజనం..