పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడుతారు. అంత పొడవు పెరగడం ఎలా అని, కలలు కంటుంటారు చాలామంది.  చాలా వరకూ తల్లిదండ్రుల జీన్స్ వల్ల పిల్లల ఎత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎత్తుగా పెరుగుతారు లేదంటే లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలతో శరీర పెరుగుదలకు ఉద్దీపన కలిగించినప్పుడు, ఎత్తు పెంచడానికి సహాయపడుతాయి. మ‌రి ఎత్తు పెరగడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలేంటో ఇపుడు తెలుసుకుందాం.

 

ఎముకల్లో విటమిన్స్ మరియు క్యాల్షియం షోషణ జరగాలంటే సోయాప్రోడక్ట్స్ ను మరియు సోయాబీన్స్ సోయా మిల్క్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మ‌రియు గుడ్డు లో విటమిన్ డి మరియు క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైనది మరియు ఎముకలకు తగినంత క్యాల్షియం అందివ్వడంలో హైట్ పెర‌గ‌డానికి గుడ్డు బాగా సహాయపడుతుంది. బెండకాయలో ఉండే విటమిన్లు, ఫైబర్, పిండిపదార్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. 

 

అంతేకాదు బెండకాయ తింటే తెలివితేటలతో పాటు.. ఎత్తు పెరిగే అవకాశం ఉంది. పెరుగు ఒక డైరీ ప్రొడక్ట్. ఇందులో అధిక ప్రోటీనుల మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, బి, డి మరియు ఇలు ఉన్నాయి. ఇవి ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లభిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: