ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన ప్రకంపనలు  అంతా ఇంతా కాదు. ఏకంగా సాఫీగా సాగిపోతున్న ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రతి ఒక్కరికి ప్రాణభయం అంటే ఏంటో పరిచయం చేసింది. ఇంకెంతో మందిని మృత్యువు ఓడిలోకి చేర్చి ఎన్నో కుటుంబాలని రోడ్డున పడే పరిస్థితికి తీసుకువచ్చింది. ఇక కొన్ని నెలల పాటు భయపడి ఇంటి నుంచి కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితికి కారణమైంది.


 ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ వ్యాప్తిని చూసి ఇక మా పని అయిపోయింది అని అనుకోకుండా ఉన్నవారు ఒక్కరు కూడా కనిపించరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసిరింది. ఆ తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఇక అన్ని దేశాలు కూడా ఈ కనిపించని శత్రువుతో ఎంతో సమర్థవంతంగా పోరాటం చేశాయి. ఇక ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండటంతో వ్యాక్సిన్ కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ వార్తలు కూడా తిరమీదికి వచ్చాయి.


 అయితే ఇదే విషయం పై అటు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజేనిక కంపెనీ తొలి సారి స్పందించింది. తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కి కారణం అవుతుంది అంటూ ఆస్ట్రాజనిక కంపెనీ తొలిసారి అంగీకరించింది. వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకే లో పలువురు కోర్టుకు ఎక్కారు. రక్తం గడ్డ కట్టడంతో పాటు ప్లేట్ల సంఖ్య తగ్గింది అంటూ పేర్కొన్నారు. అయితే అరుదైన సందర్భాల్లో అలా జరగొచ్చు అంటూ ఆస్ట్రాజేనక కంపెనీ అటు కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ కోవిషీల్డ్ అనే పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లను విక్రయించింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: