నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో సగటున రోజుకు రూ.60 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగగా.. గత రెండ్రోజుల్లో ఒక్కోరోజు దాదాపు రూ.200 కోట్ల మద్యం విక్రయాలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్‌ 30, 31 తేదీల్లో రూ.380 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన రెండు రోజుల్లో 4.85 లక్షల కేసుల లిక్కర్‌, 5.10 లక్షల కేసుల బీర్ల విక్రయాలు చోటుచేసుకున్నాయి.

 

అయితే దశలవారీగా మద్య నిషేధం అమలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది నవంబర్‌ నెలలో అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌ మద్యం అమ్మకాల్లో 22.31 శాతం మేర తగ్గుదల నమోదైంది. గత ఏడాది నవంబర్‌లో బీర్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో సగానికి పైగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది కంటే ఈ నవంబర్‌లో 54.30% తగ్గుదల నమోదైంది.

 

గతంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను ప్రభుత్వం 3,500కు తగ్గించింది. విక్రయ వేళల్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేశారు. కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, వేళల్ని కచ్చితంగా పాటించడంతో మద్యం విక్రయాలు క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

 

కానీ కొత్త సంవత్సరం రోజున మాత్రం మన మందుబాబుల జోరు ఒక రేంజ్ లో కొనసాగింది. ఇక మద్యం సేవించి పోలీసులకు చిక్కిన వారి సంఖ్య అయితే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని చాలా చాలా ప్రాంతాల్లో.. మందుబాబులు.. డ్రంక్ డ్రైవ్ లో దొరికారు.  చాలా చోట్ల మోతాదుకి మించి మద్యం సేవించిన కొందరు.. రోడ్లపై నానా రభస చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: