కరోనా మహమ్మారి ప్రపంచం పై విజృంభించడం వల్ల ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సుచి, శుభ్రతను పాటించడమే కాకుండా, ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే.
మాస్కులు లేకుండా బయట కనిపిస్తే అధికారులు జరిమానాలు విధించడం కాకుండా పలు శిక్షలను అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రతి ఒక్క దేశంలో, రాష్ట్రంలో అమలు అవుతుంది. అయితే ఇండోనేషియాలో మాత్రం మాస్కులు లేకుండా బయటకు వెళ్ళిన వారికి జరిమానా విధించడంమే కాకుండా, ఎలాంటి శిక్ష అమలు చేస్తున్నారు ఇక్కడ తెలుసుకుందాం...

ఇండోనేషియాలో నివసించే ప్రజలు మాత్రమే కాకుండా ఆ దేశంలోకి వెళ్లే ఇతర దేశాల వారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలనే నిబంధనను పెట్టారు. ఈ నేపథ్యంలోనే మాస్క్ పెట్టుకోకుండా, ఇండోనేషియాలో పోలీసుల కంట పడితే వారికి శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండోనేషియాలో ఉన్న రిసార్ట్ ద్వీపమైన బాలిలో మాస్క్ లేనివారికి 7 డాలర్లు జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే డబ్బులు కట్టలేని వారి చేత కరోనాతో మరణించిన వారి కోసం గుంతలు తీయించే శిక్ష వేసేవారు.

తాజాగా ఇండోనేషియాలో అమలవుతున్న ఈ శిక్షతో పాటు మరో కొత్త శిక్షను కూడా అమలులోకి తీసుకు వచ్చారు. తాజాగా ఇండోనేషియాలో ఎవరైనా మాస్కులు లేకుండా కనిపిస్తే వారితో రోడ్డుపైనే 50 పుష్ అప్స్ చేయిస్తున్నారు. ఈ శిక్ష విషయంలో అక్కడ ఆడ మగ అనే సంబంధం లేకుండా ఇద్దరి చేత ఈ శిక్షను అమలు చేస్తున్నారు.అయితే ఈ శిక్ష కేవలం ఇండోనేషియాలో నివసించే ప్రజలకు అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. అక్కడ నివసించే ప్రజలకు మాత్రమే కాకుండా ఆ దేశానికి వెళ్లే పర్యాటకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని ఇండోనేషియా ప్రభుత్వం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: