ప్రొద్దున్నే కాస్త వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా వేగంగా నడవడం చేయడం ద్వారా శరీరానికి మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. అలా స్పీడ్ గా నడవడం వల్ల కరోనా కూడా రాదని అంటున్నారు. బ్రిటన్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టామ్ యేట్స్ ఉదయం పూట చేసే చురుకైన నడకపై పరిశోధనలు జరిపారు. ఉదయాన బ్రిస్క్ వాక్ అలవాటు ఉన్నవారిలో కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపదని గుర్తించారు. 


వీరిలో వయసు తగ్గిపోతుందని కూడా తేల్చారు. వీరిలో జీవించి ఉండే వయసు 20 సంవత్సరాల వరకు పెరుగుతుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడించారు..తద్వారా ఆక్సిజన్‌ను బాగా ఉపయోగించుకోవచ్చు. 2015 లో ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 20 నిమిషాల చురుకైన నడక మరణ ప్రమాదాన్ని 30 శాతం తగ్గిస్తుంది.ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సూర్మరశ్మిలో నిలుచోవడం ద్వారా డీ విటమిన్ పొందవచ్చు.. 


చేతులు నిటారుగా పెట్టీ, మెడను వంచకుండా నడవాలి..ఇలా చేయడం వెన్నెముకను కూడా నిటారుగా ఉంచుతుంది. నడుస్తున్నప్పుడు 10 నుండి 30 అడుగుల పరిధిని గమనిస్తూ ఉండాలి.నడిచేప్పుడు పొడవైన అడుగులు వేయకుండా చూసుకోవాలి. అలా పొడుగాటి అడుగులు గురుత్వాకర్షణ కేంద్రానికి ముందుకు వచ్చి మోకాలికి నష్టం కలిగిస్తుంది. ఫలితంగా నొప్పితోపాటు సమతుల్యత క్షీణిస్తుంది.ఫ్లాట్ అడుగుల నుంచి శక్తి బదిలీలో సమస్య ఉంటుంది. అదే సమయంలో పాదాల నొప్పి సమస్య కూడా పెరుగుతుంది... ఇలా రోజు నడిస్తే ఆరోగ్యానికి చాలా మేలని నిపుణులు అంటున్నారు.. చూసారుగా 20 నుంచి 30 నిమిషాలు ఇలా నడిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీరు కూడా ఇప్పటి నుంచి అలా నడవండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: