దేశంలో కరోనా సంక్షోభం ఒకవైపు, విష జ్వరాలు మరోవైపు, పలు తుఫాన్ లు ఇంకోవైపు దాడి చేస్తున్నాయి. ఆయా వ్యాధులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. తుఫాన్లతో రైతు పంట నష్టపోతున్నాడు. ఇటీవల తుఫాన్ లతో ఆయా ప్రాంతాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడి పట్టణ ప్రాంతాలు కూడా నీటమునిగిపోతున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావద్దనే హెచ్చరికలు కూడా చేయాల్సి వస్తుంది. రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది చాలా ప్రాంతాలలో. తాజా గులాబ్ తుఫాను ప్రభావం తో పలు రైళ్లు రద్దు చేసినట్టు, మరికొన్ని దారి మళ్లించినట్టు ఆశాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఆరంజ్ అలర్ట్ ను జారీచేసింది. ఈ ప్రభావం ఉన్న ప్రాంతాలలో పలు రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విదుదల చేసింది. ప్రయాణికులు దీనిని గమనించి సహకరించాలని కోరింది. ఈ ప్రకటన ప్రకారం 26వ తేదీన హౌరా -సికింద్రాబాద్ స్పెషల్ (02703) హౌరా నుండి ఉదయం 8.35కి బదులుగా మధ్యాహ్నం 2.35కి బయలుదేరనుంది. అదేవిధంగా హౌరా నుండి యస్వంత్ పూర్ స్పెషల్ (02245) ఉదయం 10.50 కి కాకుండా మధ్యాహ్నం 2.50కి బయలుదేరుతుంది. అలాగే అదేతేదీన  టాటా నగర్ నుండి ఎర్నాకులం స్పెషల్ కూడా టాటా  నగర్ నుండి ఉదయం 5.15 కు కాకుండా 11.15కి బయలుదేరుతుంది.

పలు రైళ్ల రద్దు వివరాలు : తేదీ 26 :

07015 భువనేశ్వర్-సికింద్రాబాద్
02071 భువనేశ్వర్-తిరుపతి
02859 పూరి-చెన్నై సెంట్రల్
02085 సాంబార్ పూర్-హెచ్ నాందేడ్
07244 రాయఘడ్ -గుంటూరు
08463 భువనేశ్వర్-కే ఎస్ ఆర్ బెంగుళూరు సిటీ
02845 భువనేశ్వర్-యస్వంత్ పూర్


27న రద్దైన పలు రైళ్లు :

02072 తిరుపతి-భువనేశ్వర్
02860 చెన్నై సెంట్రల్-పూరి
02086 హెచ్ ఎస్ నాందేడ్-సాంబార్ పూర్
08464 కే ఎస్ ఆర్ బెంగుళూరు సిటీ - భువనేశ్వర్
02846 యస్వంత్ పూర్-భువనేశ్వర్

ఇంకా పలు రైళ్లు దారి మళ్లించారు. ఆ వివరాలు రైల్వే ట్వీట్ లో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: