ఈ మధ్యకాలంలో ఆహారంపై,ఆరోగ్యం ఆధారపడి ఉందని చాలామంది, డైట్లని ఫాలో అవుతూ ఉన్నారు. ఇందులో భాగంగా అవిసెగింజలు,సన్ఫ్లవర్ సీడ్స్, బాదం,పిస్తా వంటి ఎన్నో డ్రైఫ్రూట్స్ ని తీసుకొని ఆరోగ్యానికి మేలు చేకూర్చుకుంటున్నారు. వీటినే కాక చియా సీడ్స్ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కాల్షియం,మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వీటిని తినకుండా వదలరు. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


అధిక బరువు తగ్గేందుకు..
చియా సీడ్స్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల, ఇవి అధిక బరువు తగ్గేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకోసం ఒక గ్లాసులో ఒక స్ఫూన్ చియా సీడ్స్ నీళ్లను వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. వీటిని పరగడుపునే తేనె,నిమ్మరసం కలుపుకొని తీసుకోవడం వల్ల,పొట్ట నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. కావున ఇది మాటి మాటికి తినాలనే కోరిక తగ్గించి తొందరగా సన్నబడటానికి దోహదం చేస్తుంది.

 షుగర్ అదుపులో ఉంచుకోవడానికి..
ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాల వల్ల వీటిని అధికంగా తీసుకోవడంతో, రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్  హెచ్చుతగ్గులు కాకుండా దోహదపడుతుంది. దీనితో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి మధుమేహం అదుపులో ఉంటుంది.

ఎముకల బలానికి..
 చియా సీడ్స్ లో అధికంగా ఉన్న కాల్షియం ఎముకలు దృఢంగా చేయడమే కాకుండా, కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు  ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది. మరియు ఇందులోని మెగ్నీషియం గుండె కండరాలను దృఢంగా తయారు చేయడానికి దోహదపడతాయి.

 క్యాన్సర్ నివారణకు..
ఇందులోని ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు క్యాన్సర్ కు కారణమైన ప్రిరాడికల్స్ తో పోరాడి, క్యాన్సర్ దరిచేరకుండా కాపాడుతుంది.

సీజనల్ వ్యాధులు..
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల,ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లు సీజనల్గా వచ్చే దగ్గు,జలుబును రాకుండా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: