ఈ సృష్టిలో అనేక రకాల జీవులు ఉంటాయి. అయితే ఇలా ప్రతి జీవి జీవనశైలిలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఇలాంటి రహస్యాలను కొన్ని కొన్ని సార్లు శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉంటారు. ఇక ఈ విషయాలు తెరమీదకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే భూమ్మీద ఉండే ప్రమాదకరమైన జీవులలో అనకొండ కూడా ఒకటి. ఒక్కసారి ఆకలేసింది అంటే చాలు ఎంతటి జీవినైనా సరే అమాంతం మింగేస్తూ ఉంటుంది. ఇక అనకొండ సైజు కూడా భయంకరంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే అనకొండ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అన్న విషయం కళ్ళకు కట్టినట్లుగా హాలీవుడ్ మూవీ అనకొండ సినిమాలో చూపించారు. ఇకపోతే ఇప్పుడు అనుకొండ పాము కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా సంభోగం సమయం లో ఆడ అనకుండా మగ అనకొండను ఏకంగా చంపి తింటుందట. దీనికి కారణం పరిమాణంలో మగ అనకొండ కంటే ఆడ అనకుండా ఎక్కువ పెద్దదిగా ఉండడమే అన్నది తెలుస్తుంది.


 ఇటీవల దక్షిణ అమెరికాలో చేసిన పరిశోధనలో సైంటిస్టులు ఈ విషయాన్ని కనుగొన్నారు  పాము జాతుల్లో సెక్స్ చేయాలని కోరిక మొదట ఆడ పాముల్లోనే ఎక్కువగా కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఆడ పాము చల్లని లేదా వేడి వాతావరణం లో నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని చర్మాన్ని తొలగిస్తుంది. అప్పుడు అది ఫెరోమిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుందట. దాని వాసనను మగ పాములు పసిగట్టి సంభోగానికి సిద్ధమవుతూ ఆడ పాము దగ్గరికి  వస్తాయట. ఇక సంభోగం ప్రక్రియ మొత్తంలో ఆడపామే ఆదిపత్యం చెలాయిస్తుందట. సహచరులు ఎంపిక నుంచి సంభోగం కాలం వరకు నిర్ణయాధికారం మొత్తం ఆడ పాముకే ఉంటుందట. ఒకవేళ ఆడక పాము సంభోగంలో సంతృప్తి చెందకపోతే వెంటనే మగపామును దూరం పెట్టేసి మరొక భాగస్వామిని వెతుక్కుంటుందట. ఆడ అనకుండా సంభోగం తర్వాత మగ అనుకుండను అమాంతం మింగేస్తుందట. ఇలా సంభోగం తర్వాత మగ పాము ఆడ అనకొండ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: