ఈ చిట్కా కోసం ముందుగా గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని,అందులో హాఫ్ స్పూన్ చక్కర,రెండు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జు,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ముఖాన్ని బాగా శుభ్రపరచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి 8 ఆకారంలో మసాజ్ చేస్తూ అప్లై చేయాలి.ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత అరగంటసేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా మర్దనా చేస్తూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మరియు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం చర్మం డిహైడెడ్ కాకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.అంతేకాక మంచి పోషకాలు మరియు విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకొవాలి.ఎందుకంటే శరీరంలోని కొల్లాజన్ పదార్థాన్ని విటమిన్ సి చాలా బాగా ఉత్పత్తి చేస్తుంది. మరియు అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి.దీనివల్ల ముఖంపై పేర్కొన్న జిడ్డు మరియు మృత కణాలు,వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ అన్ని తగ్గిపోతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలు అన్ని పాటించి మీ ముఖాన్ని గ్లాసీగా,మెరుస్తూ ఉండేలా తయారు చేసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి