చలికాలంలో చాలా చల్లగా ఉంటుంది.ఈ సీజన్లో శరీరాన్ని వేడిగా ఉంచుకోకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కూడా.ఈ సీజన్ లో వచ్చే చల్ల గాలులా నుంచి బయట శరీరాన్ని కాపాడుకోవడానికి స్వేటర్,మఫ్లర్,దుప్పటి వంటివి వాడి చలిని పోగొట్టుకుంటూ ఉంటాము.కానీ లోపలి చలిని పోగొట్టే ఆహారాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.ఈ ఆహారాలను తరుచూ తీసుకోవడంతో శరీరం ఎక్కువ తీవ్రతతో కూడిన చలిని అదిగమిస్తుందట.అంతే కాక సీజనల్ వచ్చే రోగాలను దూరం చేసుకోవచ్చు.మరీ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండీ..

పాలు..

పాలకు శరీరానికి వేడిని కలిగించే గుణం ఉంటుంది. ఇందులో వున్న మాంసపుకృతులు కరిగినప్పుడు శరీరం అధిక వేడిని ఊత్పత్తి చేస్తుంది.కావున చలికాలంలో పాలను ఇవ్వడంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

నువ్వులు..

నువ్వులలో అధిక పైబర్ మరియు యాంటీ బ్యాక్టీరియల్  గుణాలు అధికంగా ఉండడమే కాక,వీటిని తరుచూ తీసుకోవడంతో శరీరానికి వేడిని అందించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి.అంతేకాక చలికాలంలో అధికంగా హార్మోనల్ ఇన్ బాలన్స్ కి గురవుతూ ఉంటారు ఆ సమస్యను తీర్చడంలో కూడా నువ్వులు బాగా ఉపయోగపడతాయి.

చిరు దాన్యాలు..

పూర్వకాలంలో మన పెద్దలు వారి శారీరక శ్రమ కోసం మరియు శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి చిరుధాన్యాలను ఎక్కువగా తినేవారు.మరి ముఖ్యంగా ఇందులో రాగులు,సజ్జలు,జొన్నలు,గోధుమలు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే తీసుకోవడం వల్ల  చాలా ఆరోగ్యకరంగా ఉండేవారు.మరియు సీజనల్ రోగాలు కూడా వారి దరిచేరేవి కావు.

అరికెలు..

తృణదాన్యాలలో అరికెలకు శరీరానికి వేడిని పుట్టించే గుణం అధికంగా ఉంటుంది.కావున చలికాలంలో ఎక్కువగా అరికెలతో చేసిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

బొప్పాయి..

చలికాలంలో అధికంగా బొప్పాయి తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటిఫంగల్,అధిక ఫైబర్ గుణాలు శరీరానికి పుష్కలంగా ఉంది,శరీరం వేడిగా ఉండడానికి దోహదపడతాయి.

చలికాలంలో వేడిగా ఉండడానికి పిల్లలకు కూడా ఈజీగా ఇవ్వడానికి పైన చెప్పిన ఆహారాలన్ని పనికి వస్తాయి.కానీ ఈ ఆహారాలకు గర్భిణీ స్త్రీలు మాత్రం దూరంగా ఉండడం చాలా ఉత్తమం.అంతేకాక చలికాలంలో జీవశక్తి తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.కావున ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ వీటిని తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: