చాలామంది సాధారణమైన వారు కూడా కుంకుమపువ్వును ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు . కుంకుమపువ్వు తాగడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయని కుంకుమ పువ్వును తీసుకుంటూ ఉంటారు . మృగంధ ద్రవ్యాల్లో రారానిగా భావించే కుంకుమపువ్వు అత్యంత విలువైనది . చాలా ఖరీదైనది కూడా . మిఠాయిల్లో కుంకుమ పువ్వు వేస్తే రుచి అదిరిపోతుంది . కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా కుంకుమ పువ్వు ని వాడుతూ ఉంటారు .  కుంకుమ పువ్వు కలిపిన పాలు ఆరోగ్యానికి చాలా మంచిది .

 ఇందులో ఔషధ గుణాలు మరియు పాల పోషకాలు కలగలిసిన పోషకాలు ఉంటాయి . దీని కారణంగా ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా చాలా బలం . కుంకుమ పువ్వు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . అందుకే తరచుగా దీనిని పాలల్లో కలుపుకుని తాగుతారు . కానీ వేసవిలో కుంకుమపువ్వు పాలు తాగాల వద్ద అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది . కుంకుమ పువ్వు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . వేసవిలో జలుబు మరియు దగ్గు ఉన్నవారు కుంకుమపువ్వు పాలు తప్పనిసరిగా తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు . అయితే కుంకుమపువ్వును ఎల్లప్పుడూ చల్లని పాలలో మాత్రమే కలుపుకుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు .

వేసవిలో వేడి పాలలో కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది . కొంతమంది రాత్రి పూట పాలు జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది . అందుకే కొంతమంది దీనిని ఉదయం తాగడానికి ఇష్టపడతారు . అటువంటి పరిస్థితుల్లో మీ శరీర సభావాన్ని బట్టి పాలు తాగే సమయాన్ని నిర్చయించుకోండి . చల్లని పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకుంటే చర్మం మెరుస్తుందని నిపుణులు అంటున్నారు . ప్రత్యేక కాకుండా ఇది మెదడుకు కూడా మంచిది . శరీరాన్ని చాలా భరుస్తుంది కూడా . ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే చర్మంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది . దీని కారణంగా వాంతులు మరియు విరోచనాలు వంటివి ఎదురవుతాయి . అందువల్ల వేడి పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని ఎప్పుడు తాగకూడదు . చల్లబడ్డ పాలల్లో కలుపుకుని తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: