
అవి మనం చూస్తూనే ఉంటాం. అయితే శ్రావణమాసంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు . అయితే మరి ముఖ్యంగా కొన్ని తప్పులు తెలిసి చేసిన తెలియక చేసిన వాటి ప్రభావం మాత్రం తీవ్రస్థాయిలోనే ఉంటుంది అంటున్నారు పండితులు .మరీ ముఖ్యంగా కొంతమంది జనాలు ఈ శ్రావణమాసంలో ఎక్కువగా మాంసాహారాలు తింటుంటారు.అలా చేయడం మహా మహా పాపం అంటున్నారు పండితులు . అంతేకాదు మాంసాహారం తినేవాళ్లు కనీసం శ్రావణ శుక్రవారం రోజున అయిన తినకుండా ఉంటే మంచిది అంటున్నారు .
కొంతమంది శ్రావణమాసంలో అస్సలు మాంసాహారం ముట్టరు. కొంతమంది మాత్రం శుక్రవారం , శనివారం అని లేకుండా ప్రతిరోజు మాంసాహారం తినేస్తూ ఉంటారు . అది చాలా చాలా తప్పు అంటున్నారు పండితులు. అంతేకాదు మరి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో చేతినిండా గాజులు..ముఖానికి పసుపు నుదట కుంకుమ.. ఎప్పుడూ చక్కగా రెడీ అయి ఉండాలి అంటున్నారు . ఇంట్లో ఎటువంటి అరుపులు.. కేకలు.. తప్పుడు మాటలు అస్సలు వినిపించకూడదట . మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు ఎవరైతే పూజలు చేసుకుంటున్నారో ..నోములు నోచుకుంటున్నారో ..వ్రతాలు చేస్తున్నారో.. ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు.. ఇంటి ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకొనే పెట్టుకోకూడదు . హ్యాపీగా సంతోషంగా ఉండాలట . భార్యాభర్తలు కూడా ఏ విధంగా కీచులాడుకోకుండా ఉండడం చాలా మంచిది అంటున్నారు పండితులు. అంతే కాదు ఈ శ్రావణ శుక్రవారలలో ఎవరైతే పూజలు, నోములు, వ్తరాలు చేసుకుంటున్నారో ..ఆ భార్య బర్తలు బ్రహ్మచార్యం పాటించాలి అంటున్నారు పండితులు...!