
1 నేనొక్కడినే మూవీ ట్రైలర్ ను మేము రిలీజ్ చేయలేదని ఆ సినిమా ట్రైలర్ ను ఫ్యాన్స్ కోసం మేము థియేటర్లలోనే ప్రదర్శించి హీరోతో ఫ్యాన్స్ చిట్ చాట్ నిర్వహించాలని అనుకున్నామని నిర్మాత వెల్లడించారు. మేము వేదికపైకి వెళ్లే సమయంలో ఒకరు మాట్లాడుతూ ఈ ట్రైలర్ ప్రదర్శిస్తే సినిమాకు ఓపెనింగ్స్ రావు అని చెప్పారని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.
ఆ కామెంట్ల వల్ల మేము ట్రైలర్ ప్రదర్శనను ఆపేశామని ఆయన అన్నారు. థియేటర్ లో సినిమా చూస్తున్న సమయంలో హీరోకు ఆ వ్యాధి ఉందని తెలియగానే చాలామంది నిరుత్సాహానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆ విషయం అభిమానులకు ముందే తెలిసి ఉంటే మాత్రం ఇబ్బంది ఉండేది కాదని అనిల్ సుంకర వెల్లడించారు. అందుకే ట్రైలర్ లో మేము కాన్సెప్ట్ చెప్పానుకున్నామని నిర్మాత అభిప్రాయపడ్డారు.
అప్పటికే మేము మహేష్ బాబు తో మేము దూకుడు సినిమాను నిర్మించామని 1 నేనొక్కడినే ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని భావించామని చెప్పుకొచ్చారు. 1 నేనొక్కడినే మూవీ కమర్షియల్ గా ఫ్లాపయినా ఒక వర్గం అభిమానులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమా కథనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు