ఈ మధ్యకాలంలో బిజినెస్ చేయాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఇక అందుకే నిరుద్యోగ సమస్యతో బాధపడే కన్నా ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేసే కన్నా ఇంటి దగ్గరే ఉంటూ మంచి ఆదాయాన్ని పొందే ఒక బిజినెస్ చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలామంది బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక అలాంటివారి కోసమే ఒక చక్కటి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. అదే మసాలా మేకింగ్ బిజినెస్.. ఈ బిజినెస్ తో మీరు ప్రతి నెల రూ.20 వేలకు పైగా లాభాన్ని అయితే కచ్చితంగా పొందుతారు.

ఇక ఈ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి అనే విషయానికొస్తే.. మేకింగ్ వ్యాపారం మొదలుపెట్టడానికి మీకు తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇకపోతే భారతదేశంలోని వంట గదిలో సుగంధ ద్రవ్యాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మనదేశంలో టన్నులకొద్దీ వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మీరు మసాలాలు తయారు చేసే విక్రయిస్తే మంచి లాభాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఎలాంటి మసాలాలను ప్రజలు ఇష్టపడతారో వారి రుచులకు తగ్గట్టుగా మీరు మసాలాను తయారు చేస్తే సరిపోతుంది.


ఇక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నివేదికలో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూ ప్రింట్ తయారు చేయబడింది. ఈ నివేదిక ప్రకారం సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చు అవుతుంది 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ. 50,000 , పరికరాలు రూ.30,000 ఖర్చు అవుతుంది. ఇక ఇలా మొత్తం తో మీరు ఈ వ్యాపారం మొదలుపెట్టి.. ప్రత్యేక 193  క్వింటాళ్ల  ఉత్పత్తి చేయవచ్చు. ఇక ఆదాయం విషయానికి వస్తే ప్రతి నెల రూ.21, 000 మీ చేతికి వస్తాయి. ప్రస్తుతం ఒక క్వింటా మసాలా ధర రూ.5,400 ధర పలుకుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: