జూన్ నెలలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మెగా టోర్నీ కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే ఈ టి20 ప్రపంచ కప్ టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఈసారి ఈ వరల్డ్ కప్ పోరు ఎంతో రసవత్తరంగా ఉండబోతుంది అని అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇక ఈ వరల్డ్ కప్ కోసం ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించాలి అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆయా దేశాల క్రికెట్ బోర్డులకి  డెడ్ లైన్ విధించింది. దీంతో మరికొన్ని రోజుల్లో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ టి20 వరల్డ్ కప్ టీం ను ప్రకటించే ఛాన్స్ ఉంది.



 అయితే గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్లలో సత్తా చాటుతున్న నాకౌట్ మ్యాచ్ లలో లో మాత్రం ఓడిపోతూ అభిమానులను నిరాశ పరుస్తూ వస్తున్న టీమిండియా.. ఇక ఈసారి మాత్రం అద్భుతంగా రాణించాలని అనుకుంటుంది. ఇక టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. అయితే ఐపీఎల్ లో రాణించిన ఎంతోమంది ఆటగాళ్లకు టి20 వరల్డ్ కప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బిసిసిఐ వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టును ప్రకటించక ముందే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయం ప్రకారం వరల్డ్ కప్ టీం ఏంటి అన్న విషయాన్ని ప్రకటిస్తున్నారు. ఇలా మాజీ ప్లేయర్లు ప్రకటిస్తున్న వరల్డ్ కప్ టీమ్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్.



 అయితే ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రైకర్ సైతం ఇలా 15 మంది సభ్యులతో కూడిన భారత వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో అటు విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయకపోవడం చర్చనీయంశంగా  మారింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, యశస్వి జైష్వాల్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, చాహల్, బుమ్రా, ఆవిష్ ఖాన్, సిరాజ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రానా లాంటి ప్లేయర్లను తన టి20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేశాడు సంజయ్ మంజ్రేకర్. అయితే ఫ్యూచర్ కెప్టెన్ అని పిలుచుకునే హార్దిక్ పాండ్యాను ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: