టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ అప్పట్లో కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ లో ఎంతో పేరు గడించి కొనసాగారు. ఆ తరువాత నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ విపరీతమైన క్రేజ్, మాస్ ఫాలోయింగ్ తో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆపై తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తొలి సారిగా టాలీవుడ్ కి ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

క్రాంతి కుమార్ నిర్మాతగా కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా ఇదే ఇదే రోజున అనగా సెప్టెంబర్ 22, 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని దక్కించుకోవడం జరిగింది. జయసుధ, రావుగోపాల రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో చిరంజీవి నరసింహ అనే పాత్ర పోషించారు. ఇక అక్కడి నుండి ప్రారంభం అయిన మెగాస్టార్ సినిమా కెరీర్ ఆ తరువాత మనవూరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, కొత్త అల్లుడు ఇలా మంచి సక్సెస్ లతో కొనసాగింది. అయితే మొదట్లో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన చిరంజీవి ఆ తరువాత హీరోగా మారారు.

ఇక హీరోగా ఆయనకు పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందించిన సినిమా ఖైదీ. 1983లో కోదండరామిరెడ్డి తీసిన ఈ సినిమా భారీ విజయం తరువాత హీరోగా చిరంజీవికి విపరీతమైన ఆఫర్లు రావడం, ఆపై ఆయా సుప్రీం హీరోగా, అలానే మెగాస్టార్ గా టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల పటు నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మూవీలో నటిస్తున్న మెగాస్టార్, నేటితో తన సినీ కెరీర్ 42 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆగష్టు 22 తాను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్ 22 నటుడిగా సినిమా రంగంలో ప్రాణం పోసుకున్న రోజు అంటూ ఒక పోస్ట్ చేసారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఆ పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: