అడపాదడపా సినిమాల్లో నటించిన మాధవీలత ప్రస్తుతం బీజేపీ యువ నాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాధవి లత సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాధవీలత పలు సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఎప్పుడు అభిమానులకు దగ్గరవుతుంటారు. దాదాపు 5.6 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మాధవీలత తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. తన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతా నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

మాధవీలత ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉంది. ఈ సందర్భంగా ఆమె తెలియజేస్తూ నా ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసిన ప్రతి పోస్ట్ 90% నెగిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ఈ సమాజానికి నాలాంటి వాళ్ళు అవసరంలేదు. ప్రస్తుత సమాజానికి ఫేక్ అండ్ ప్లాస్టిక్ నవ్వులే కావాలి. నేను అలా ఉండలేను. అందుకే ఫేస్ బుక్ నుంచి ఎదురయ్యే ఈ నెగిటివ్ రెస్పాన్స్ వల్ల నేను విసుగు చెందాను అందుకోసమే ఫేస్ బుక్ నుంచి తొలగిపోతున్నాను అంటూ తెలియజేశారు.

మాధవి లత ఫేస్ బుక్ నుంచి ఏదైనా లైవ్ పెట్టిన, పోస్ట్ పెట్టిన నెటిజన్లు ఆమెను ఎంతో దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.అలాంటివారికి మాధవిలత కూడా తనదైన రీతిలోనే గట్టిగా బూతులు తిడుతూ సమాధానం చెబుతూ ఉంటారు. ఈవిధంగా వీరిరువురి మధ్య పరస్పరం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్ల నుంచి వస్తున్న నెగిటివిటీ వల్ల ఎంతో విసుగు చెందానని అందుకోసమే ఈ ఖాతా నుంచి  తొలగిపోతున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి నా ఫేస్ బుక్ ను నా టీం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే తను ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇకపై ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో అందరికీ అందుబాటులో ఉంటానని మాధవీలత పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: