
వీర సింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన గోపీచంద్ మలినేని తో బాలయ్య మరోచిత్రం చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే . రాయలసీమ నేపథ్యంలో వీర సింహారెడ్డి తో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ ఈసారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడట . బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయబోయే ఈ మూవీ టైం ట్రావెల్ లాంటి కథనంతో హిస్టోరికల్ నేపథ్యంలో రాబోతుంది . ఇప్పటి స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేశాడు గోపీచంద్ మలినేని . అయితే ఈ మూవీ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరవింద్ వర్క్ చేయబోతున్నారు . ఇప్పటికే కదా చర్చలు ముగిసాయి .
కన్నడ ఇండస్ట్రీ హిట్ అయినా కాంతారా మరియు కాంతారా చాప్టర్ 1 సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత వంటి చిత్రాలకు అరవింద్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించాడు . ఇక ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు . అద్భుతమైన విజువల్స్ మరియు సినిమాటిక్ గ్రాండ్ ఇయర్ గా బాలయ్య మరియు గోపీచంద్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది . డాకు మహారాజ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కూడా బాలయ్యను అద్భుతంగా చూపించాడు . అందుకే బాలయ్య సినిమాకు రెగ్యులర్ గా ఉండే డివోపిని కథని అరవింద్ తో వేతున్నారు మూవీ టీమ్ .