విష్ణు విశాల్- గుత్తా జ్వాలా వీళ్ళు ఇప్పుడు ప్రేమ పక్షులైపోయారు. వెంటనే మాల్దీవుల్లో వాలిపోయారు. అవునండి వీళ్ళు ఇప్పుడు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడి సముద్రపు అందాలను చూస్తే ఆనందంగా గడుపుతున్నారు. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న గుత్తా జ్వాలా పుట్టినరోజు సందర్బంగా ఆమె చేతికి రింగ్ తొడిగిన ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టడం తో అప్పటినుంచి ఆ ఫోటోలను చూసిన వారికీ వీరి వివాహం ఎప్పుడన్నది ఆసక్తికరం గా మారింది.  

ఒకవేళ వీరి వివాహం జరిగితే  వారివురికీ అది రెండో వివాహం అవుతుంది. గుత్తా జ్వాలా 2005 లో చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకోగా ఆ తర్వాత వాళ్ళు వీడుకులు తీసుకున్నారు. అలాగే విష్ణు విశాల్ 2010 లో రజని నటరాజన్ ను వివాహం చేసుకోగా ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కాబట్టి గుత్తా జ్వాలా-విష్ణు విశాల్  వివాహం వాళ్ళకి  రెండోది అవుతుంది.

ఇక ఇరువురి కెరీర్ గురించి చూస్తే గుత్తా జ్వాలా ఎన్నో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నది, జాతీయ మరియు అంతర్జాతీయ,కామన్ వెల్త్ ,ఒలంపిక్ లలో కూడా గుత్తా జ్వాలా డబుల్స్ బ్యాడ్మింటన్ ఆటలో పాల్గొంది. అలాగే పతకాలను కూడా సాధించింది. ప్రస్తుతం ఆమె తన పేరుతోనే అత్యాధునిక సౌకర్యాలతో ఓ బ్యాడ్మింటన్ అకాడమీని హైదరాబాద్ లో ప్రారంభించింది. అలాగే విష్ణు విశాల్ గురించి చూస్తే ఇతడు తమిళ్ యాక్టర్, పలు తమిళ్ సినిమాలలో నటించాడు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రంగా రాక్షసన్(తెలుగు లో రాక్షసుడు) చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విష్ణు విశాల్ తమిళ్ లో  పలు సినిమాలను చేస్తున్నాడు.

అయితే వీళ్లిద్దరు మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లి గురించి చూస్తే వాళ్ళ మాటలతో చెప్పేవరకు మనం ఎదురుచూడడం తప్ప మనం ఏమి ఉహించుకోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: