కెరియర్ సందిగ్ధంలో ఉన్న టైం లో ఇస్మార్ట్ శంకర్ అంటూ పూరీ డైరక్షన్ లో ఒక సూపర్ హిట్ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన మాస్ యాటిట్యూడ్ తో రామ్ తన ఫ్యాన్స్ ను అలరించాడని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా వచ్చిన రెడ్ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో రామ్ తన స్టామినా చూపించాడు. ఇస్మార్ట్ శంకర్ అయితే రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది.

ఈ క్రమంలో రామ్ హ్యాట్రిక్ మీద గురి పెట్టాడు. అందుకే చాలా కాంబినేషన్స్ అనుకున్నా ఫైనల్ గా లింగుసామి డైరక్షన్ లో మూవీ కన్ఫర్మ్ చేశాడు. ఈ మూవీని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించడం విశేషం. సినిమాలో రామ్ సరసన ఉప్పెన హీరోయిన్, క్రేజీ భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మూవీలో అమ్మడు నటించడం కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ రెండు మూవీస్ తో హిట్ అందుకున్న రామ్ కు ఇప్పుడు చేయబోతున్న మూవీ అసలు సిసలు టెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే రామ్మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

లింగుసామితో రామ్ చేస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో దేవి శ్రీ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో కృతి శెట్టితో పాటుగా మరో కన్నడ భామ అక్షర గౌడ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఉస్తాద్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టి తన సత్తా చాటాలని చూస్తున్నాడు రామ్.  


మరింత సమాచారం తెలుసుకోండి: