కళ్యాణ్ కుమార్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు వున్న పేరు.. సినిమా రంగం ఈయనకు కొత్తేమీకాదు.. ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా పరిచయం అయినప్పటికీ అంతకుముందే , తన తల్లి అంజనా దేవి పేరు మీద నిర్మించిన అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించేవారు. ఇకపోతే ఈయన నిర్మాణ సంస్థ ద్వారా అలాగే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు అంతా దానధర్మాలకు ఖర్చు చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఈ కారణం చేతనే ఆయన రెండవ భార్య కూడా విడిపోవడం జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 2019 సంవత్సరం నాటికి ఆయన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఐదు కోట్ల 20 లక్షలు. ఇక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఒక రూ.1,50,00,000.. ఇక ఈయన ఇల్లు ,పొలాలు, స్థలాలు, లగ్జరీ కార్లు ,బైకులు, బంగారం మొత్తం అన్ని కలుపుకొని రూ.18 కోట్ల 75 లక్షలు. ఇక ఎలక్షన్స్ టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు.. అఫిడవిట్లో ఆయన పేర్కొన్న మొత్తం ఆస్తి విలువలు 52 కోట్ల 76 లక్షల రూపాయలు. ఈ మొత్తంలో పవన్ కళ్యాణ్ 25 కోట్ల రూపాయలను బ్యాంకులకు రుణాలుగా కట్టాల్సి ఉందట.

ఇక  ఆయన దగ్గర కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉంటుంది.. నిజం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా సహాయం అడిగితే, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే , తప్పకుండా వారికి డబ్బు సహాయం చేస్తారు. అంతేకాదు ప్రమాదాలు , విపత్తులు సంభవించినప్పుడు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని చేస్తాడు పవన్ కళ్యాణ్. ఇక ఆయన ఎంత సంపాదించినా అది ప్రజల కోసమే కేటాయిస్తాను అని చెప్పడం ఆయన మంచితనం.. ఆయన ఆస్తి అంటారా.. ఆయన అభిమానులు.. వారు చూపించే ప్రేమ విలువలు..

పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు.. ఇక ఇంతకుమించిన గొప్ప ఆస్తి ఎవరికి ఉండదనే చెప్పాలి.. అందరూ బాగుండాలి.. అందులో  నేను కూడా ఉండాలి అనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ నమ్ముతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: