బాలయ్యతో సినిమాలు తీయడానికి ఎంతో మంది నిర్మాతలు క్యూ కడతారు. అలాగే ఆయన్ని డైరెక్ట్ చేయడానికి కూడా ఎంతో మంది దర్శకులు ముందుకు వస్తారు. అయితే బాలయ్య మొత్తం కెరీర్ చూసుకున్నపుడు ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

ఆయన ఎక్కువగా కొత్త నిర్మాతలకే సినిమాలు చేశారు. అలాగే ఆయన మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు కూడా తరువాత కాలంలో స్టార్లు అయ్యారు. బడా ప్రొడక్షన్ హౌజ్ అనిపించుకున్నవి ఏవీ బాలయ్యతో సినిమాలు పెద్దగా చేసింది లేదు. అయితే ఈ విషయంలో బాలయ్య కూడా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుని పోతున్నారు. అలాంటి బాలయ్యతో దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్ మూవీ తీస్తున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది.

బాలయ్య అఖండ మూవీ కాదు కానీ బడా ప్రొడ్యూసర్స్ చాలా మంది క్యూ కట్టేస్తున్నారు. అదే విధంగా క్రేజీ డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమా అంటున్నారు. ఇది నిజంగా విచిత్రంగానే ఉంది. బాలయ్య అఖండకు ముందు పెద్దగా హిట్ మూవీస్ లేవు. గట్టిగా చెప్పాలంటే గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత బాలయ్యకు సరైన హిట్ పడలేదు. అయితే బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగిన కధ సెట్ అయితే ఆ హిట్ రేంజ్ ఎలా ఉంటుందో. దాని సౌండ్ ఎలా రీసౌండ్ చేస్తుందో గత బ్లాక్ బస్టర్లు నిరూపించాయి. ఇక అఖండ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు. దాంతో బాలయ్యతో సినిమాలు తీయడానికి అశ్వనీదత్ కూడా చూస్తున్నారని టాక్. ఆయన 1992లో బాలయ్యతో అశ్వమేధం మూవీని తీశారు. అది ఫ్లాప్ అయింది. మళ్లీ ఆయన ఇన్నాళ్ళకు బాలయ్యతో సినిమా తీస్తారు అన్న వార్త ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోందిట. మరి అది నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. ఇక చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: