
ఉద్యోగాల మీద ఆశలు తగ్గించుకోమని చెప్పేస్తున్నారు. 2030 కల్లా 40% ఉద్యోగాలు పడిపోయే అవకాశం ఉన్నదంటూ ఏఐసీఈఓ శ్యామ్ ఆల్ట్ ఒక బాంబు పేల్చారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కే పరిమితమైనటువంటి టెక్నాలజీ నేడు ప్రతి పనులలో కూడా భాగమయ్యిందని.. ఏఐ త్వరలోనే మానవ పరిధికి మించిన ఆవిష్కరణలు చేయగలదు అంటూ తెలిపారు.2030 నాటికి మనం చేయలేనటువంటి పనులను కూడా చేసేటువంటి ఒక అసాధారణమైన సాంకేతికంగా మారుతుందనే నమ్మకం తనకుందని తెలిపారు శ్యామ్.టెక్నాలజీ పరంగా ఇది శుభపరిణమే అయినప్పటికీ ఉద్యోగాలను తొలగించడానికి కూడా దారి తీయవచ్చు అంటు తెలియజేశారు. కానీ కొన్ని రంగాలలో పూర్తిగా కొత్తరకం పనులను సృష్టించేలా చేస్తుందని మరికొన్ని పనులు అదృశ్యమవుతాయి అంటూ తెలియజేశారు ఏఐసీఈఓ శ్యామ్ ఆల్ట్ మన్.
ఇప్పటికే చాలా ప్రాంతాలలో కూడా సాఫ్ట్వేర్ సంస్థలకు ఏఐ చెక్ పెట్టినట్లుగా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో వ్యాపారాలలో, చిన్నచిన్న పరిశ్రమలలో, వ్యవసాయ రంగాలలో ఇతర వాటిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అలాగే ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ వాల్ మార్ట్ సీఈవో డగ్ మ్యాక్ మిలన్ కూడా ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏఐ రాకతో ప్రపంచంలో ఏ ఉద్యోగం కూడా తప్పించుకోలేదని ప్రతి రంగాన్ని మార్చేస్తుందని తెలియజేశారు.