టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''కృష్ణ వ్రింద విహారి''. అనీష్ ఆర్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ అనేది చివరి దశలో ఉంది. మరోవైపు మేకర్స్ ముమ్మరంగా సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన 'కృష్ణ వ్రింద విహారి' ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో 'వర్షంలో వెన్నెల' అనే ఫస్ట్ ససాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. శుక్రవారం వదిలిన ఈ పాట ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకొని ఫుల్ సాంగ్ కోసం ఆసక్తిగా వేచి చూసేలా చేసింది. ఈ రొమాంటిక్ పాటని రేపు ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.స్టార్ హీరోయిన్ సమంతా 'వర్షంలో వెన్నెల' పాటను శనివారం నాడు ఉదయం 11.09 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా తెలియజేసారు. గతంలో 'ఓ బేబీ' సినిమాలో నాగశౌర్య ఇంకా సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.



 ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో శౌర్య సినిమాకు తన వంతు సపోర్ట్ ఇస్తుంది సమంత.'వర్షంలో వెన్నెల' అనేది ప్రధాన జంట నాగ శౌర్య ఇంకా షిర్లీ సెటియాపై చిత్రీకరించిన రొమాంటిక్ మెలోడీ. ఇందులో వీరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాటని రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మేకర్స్ పేర్కొంటున్నారు.'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో శౌర్య బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. అలనాటి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. శరత్ కుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక అలాగే వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: