జూన్ 3 వ తేదీన దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వున్న మేజర్ , విక్రమ్ , సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు ఓవర్సీస్ లో ఎలాంటి ఫ్రీ సేల్స్ ను అందుకుంటున్నాయి తెలుసుకుందాం.

మేజర్ : అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి ఫ్రీ సేల్స్ ను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ ,శోభితా ధూళిపాళ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు .

 
విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఓవర్సీస్ లో ఎక్సలెంట్ ఫ్రీ సేల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించగా సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు .

 
సామ్రాట్ పృథ్వీరాజ్ : అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ఓవర్సీస్ లో ఆశాజనకమైన ఫ్రీ సేల్స్ ను కనబరచడం లేదు అని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మంచి ఫ్రీ సేల్స్ ను ఓవర్సీస్ లో అందుకునే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

 
ఈ మూడు సినిమాలు ఓవర్సీస్ లో ఇలాంటి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి ఈ మూడు సినిమా లలో ఏ సినిమా ఓవర్ సీస్ లో  మంచి ఫ్రీ సేల్స్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: