కొన్ని చిత్రాలు కొందరు హీరోలతో చేయాల్సి ఉండగా... కథ నచ్చక పోవడం వలనో లేక , డేట్స్ కుదరక పోవడం వలనో వేరే హీరోల దగ్గరికి చేరుతుంటాయి. మరికొన్ని సినిమాలు ఓ హీరో ,దర్శకుడు కాంబోలో రావలసినవి పలు కారణాల వలన వేరొక కాంబోతో వస్తుంటాయి. ఇలా చాలానే జరుగుతుంటాయి. కాగా ఇదే తరహాలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా రావాల్సిన ఓ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతకీ ఆ సినిమా ఏమిటయ్యా అంటే 'రైతు' అనే చిత్రం. వీరి కాంబోలో ఈ మూవీ తెరకెక్కాల్సింది. కానీ పలు కారణాల వలన అది కాస్త ఆగిపోయింది. అయితే కథ పరంగా ఈ సినిమాలో అమితాబ్ ఒక పాత్రా చేయాల్సింది. కానీ ఆయన వివిధ కారణాలతో ఒప్పుకోకపోవడంతో అది కాస్తా ఆగిపోయిందట.

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కృష్ణ వంశీనే చెప్పుకొచ్చారు. ఈ టాలెంటెడ్ దర్శకుడు సీనియర్ హీరో రమ్య కృష్ణ గారి భర్త అన్న విషయం తెలిసిందే. కాగా వీరి కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్య్వూలు ఇస్తున్న కృష్ణవంశీ బాలయ్య గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాదు పలు సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలలోకి నేను తొంగిచూడను అని, నాకు సంబంధం లేని విషయాల లో జోక్యం చేసుకోను అన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే నేను దర్శకుడు పూరీ జగన్నాథ్ తో క్లోజ్ కాదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

నా కంపెనీని నేనే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.  సినిమాలు చేశానని ఆయన హీరోయిన్ ఛార్మితో మొత్తం నాలుగు చిత్రాలు తెరకెక్కించాడు అని  రెండు సినిమాలకు నిర్మాతగా నిలిచి చాలా నష్టపోయాను అని ఆయన అన్నారు. వందేమాతరం చిత్ర కథలో చిరంజీవి లేదా మహేష్ మాత్రమే కరెక్ట్ సూట్ అవుతారని అన్నది నా అభిప్రాయం. కానీ వాళ్లు చాలా బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ రావడం కష్టమే అనిపిస్తోందని అంటూ వ్యక్తం చేశారు.. కృష్ణవంశీ.   దిల్ రాజు గారితో ఓ సినిమా ఉందంటూ తెలియచేసారు. బాలయ్య వందో సినిమా కోసం వర్క్ చేసే అవకాశం ఉందని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: