తమిళ విలక్షణ నటుడు, స్టార్ హీరో విక్రమ్ ఇప్పుడు రాబోతున్న సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే ఆసక్తికరమైన సినిమాను ఆయన చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గత సినిమా మహాన్ భారీ స్థాయి లో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన అపరిచితుడు సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు విక్రమ్.

అంతకుముందు బాలా తెరకెక్కించిన శివపుత్రుడు సినిమాతో నటుడుగా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ హీరో అపరిచితుడు తో మంచి పాపులారిటీని అందుకున్నాడు. అప్పటినుంచి ఆయన పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రతి సినిమాలో ని  తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఇప్పుడు కోబ్రా అనే యాక్షన్ సినిమాతో ఆయన విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

కేజిఎఫ్ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా విక్రమ్ 20 గెటప్ లలో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నాడట. గతంలో కమలహాసన్ దశావతారం సినిమాలో పది పాత్రలతో నటించి మెప్పించాడు. ఆ తరువాత ఏకంగా విక్రమ్ 20 గెటప్ లలో కని పించడం విశేషం. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. పాత్రల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విక్రమ్ కి మాత్రం సరైన సక్సె స్ రావడం లేదని చెప్పాలి. చాలా రోజులుగా ఆయన ఎదురు చూస్తున్న థియేటర్ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: