టాలీవుడ్లో ఒకప్పుడు నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గడిచిన కొన్ని నెలల క్రితం హేమ రేవ్ పార్టీలో చిక్కడంతో ఈమె పేరు సంచలనంగా మారింది. ఈ విషయం అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్ని రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హేమ డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్టులు పాజిటివ్ వచ్చిందంటూ బెంగళూరు పోలీసులు ఆమెకు నోటీసులు కూడా పంపించారు. అయితే ఆ తర్వాత విచారణకు పిలిచి హేమాను అరెస్టు చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో కోర్టు స్టే విధించడంతో ఆమెకు ఊరట దక్కిందని చెప్పవచ్చు.

ఇప్పుడు తాజాగా నటి హేమ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హేమ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ  ఆలయంలో కన్నీరు పెట్టుకుంది. ఈరోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను తాను ప్రతి ఏడాది కూడా వస్తానని, ఈ సంవత్సరం తనకు ఒక ప్రత్యేకత ఉంది. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నిందను దుర్గమ్మ తుడిచిపెట్టింది. ఇక నేను చేయని తప్పుకి మీరందరూ నన్ను బలి చేశారంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.


ఆ సమయంలో నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు తన గుడికి వచ్చేటట్టు చేసింది దుర్గమ్మ అంటూ తెలియజేసింది. అయినా కూడా దాని నుంచి బయటపడడం నావల్ల కాలేదు ప్రతిక్షణం ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ బ్రతుకుతూ  ముందుకు వెళుతున్న తనకు కొండంత ధైర్యం ఇచ్చిందంటూ తెలిపింది.. ఎన్ని జన్మలైనా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు తాను ఎప్పటికీ మరిచిపోలేనని దయచేసి మీరు ఏదైనా వార్త రాసేటప్పుడు కూడా నిజానిజాలు తెలుసుకుని రాయడం మంచిది అంటూ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసింది నటి హేమ. ఈరోజు తాను గుడిలో ఉండి చెబుతున్నాను తాను ఈ తప్పు చేయలేదని మరొకసారి స్పష్టం చేస్తున్నానంటూ తెలిపింది నటి హేమ.

మరింత సమాచారం తెలుసుకోండి: