సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ది బెస్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న మహిళాదర్శకులలో సుధా కొంగర టాప్ లిస్టులో ఉంటారు.అయితే ఆమె ఎంచుకున్న కథలు సినిమాలను తెరపైకి తీసుకొస్తున్న విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది .అంతేకాదు ఎమోషన్ తో పాటు క్యారెక్టర్స్ కూడా జనాల్లో చాలా బలంగా పాతుకుతున్నాయి అని కూడా చెప్పవచ్చు.ఇదిలావుంటే ఇక ముఖ్యంగా సూర్యతో సూరరై పొట్రు చిత్రం దేశంలో అత్యధిక స్థాయిలో ప్రశంసలు అందుకుంది.ఇకపోతే ఇటీవల జరిగిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆ చిత్రం 5 అవార్డులను కొల్లగొట్టింది.అయితే  ఇక ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్‌తో సూరరై పొట్రు హిందీ రీమేక్‌కి చేస్తోంది.

అంతేకాదు  అలాగే కేజీఎఫ్ నిర్మాతలతో హోంబలే ఫిల్మ్స్‌లో ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక  ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇటీవల వైరల్ అయ్యాయి.ఇకపోతే కొన్ని నిజ జీవితంలోని సంఘటనలు ఆధారంగానే ఆ ప్రాజెక్టును తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా టాక్ అయితే వచ్చింది.అయితే  ఇక ఇంతవరకు సుధా కొంగర ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ నటీనటుల విషయంలో మాత్రం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఇదిలావుండగా ఇప్పుడు ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా నటించనుందని సమాచారం. అయితే యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా  సుధా కొంగర ఈ కథ కోసం కొంతమంది ప్రముఖ హీరోయిన్లను సంప్రదించినప్పటికీ వారు రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు అని కూడా టాక్ అయితే వినిపించింది.అయితే కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ ప్రాజెక్టులో నటించడానికి ఏమాత్రం సందేహం వ్యక్తం చేయకుండా ఒప్పుకుంటుందట. ఇక పోతే ఈ ప్రాజెక్టును కూడా హోంబలే ఫిల్మ్స్ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురావాలని అనుకుంటుంది.కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ లో అలాగే తమిళంలో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్న ఈ సంస్థ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులను కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయడానికి సిద్ధమవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.అయితే  మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: