జబర్దస్త్ షో ద్వారా ఎవరు ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ అందుకున్న కమెడియన్లలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ షో లో ఆఫర్ రావడం వల్ల జబర్దస్త్ షోకు దూరమైయినా ప్రస్తుతం స్టార్ మా లోనే కొనసాగుతూ పలు షోలు, కార్యక్రమాలు ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక పలు సినిమాలలో కూడా నటిస్తూ క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే అవినాష్ తండ్రి కాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. వైరల్ అవుతున్న వార్త అవినాష్ దృష్టికి రావడంతో ఈ వార్తలపై స్పందించి స్పష్టత ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం.



తన భార్య అనూజ  ప్రెగ్నెంట్ అయిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. ఒక వీడియోలో అవినాష్ అనూజాతో నిన్న పనులు చేయవద్దని డాక్టర్ చెప్పారుగా విశ్రాంతి తీసుకోమని .. అని చెప్పుకొచ్చారు అలా యూట్యూబ్ ఛానల్స్ అనూజ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ప్రచారం మొదలయ్యాయట. ఇక దీంతో ఎక్కడికి వెళ్లినా ఇదే విషయాన్ని అడుగుతున్నారని అవినాష్ తెలియజేయడం జరిగింది. మా స్నేహితులు, బంధువులు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారని అవినాష్ తెలియజేశారు. ఇక తమ తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి ఫోన్ చేసి అడగడంతో మాకే షాక్ అనిపించిందని కామెంట్ చేశారు అవినాష్.

మాకు కూడా తెలియని ఈ విషయం గురించి మమ్మల్ని అడిగితే మేము ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదని తెలియజేశారు. ఏదైనా శుభవార్త ఉంటే ముందుగా అభిమానులకే తెలియజేస్తామని ముక్కు అవినాష్ కామెంట్లు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం చెందినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం వల్ల తన భార్య అనూజ కూడా బయటికి వెళ్లడం లేదని అవినాష్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: