జాతి రత్నాలు మూవీ తో దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న అనుదీప్ కేవి ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. 

మూవీ ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రిన్స్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ని ప్రకటించింది. తాజాగా ప్రిన్స్ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ప్రిన్స్ మూవీ ట్రైలర్ ని అక్టోబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని సాంగ్స్ ని చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ప్రిన్స్ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: