మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉండడం తో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం బాస్ పార్టీ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఊర్వశి రౌటేలా స్టెప్పులు వేసింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ లోని బాస్ పార్టీ సాంగ్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాస్ పార్టీ మేకింగ్ వీడియో సాంగ్ ను ఈ ఆదివారం రోజు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రవితేజమూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. బాబీ సింహ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: